చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకుంటాం: యం.డి.హెచ్.పవన్ కళ్యాణ్

4134చూసినవారు
చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకుంటాం: యం.డి.హెచ్.పవన్ కళ్యాణ్
పలమనేరు నియోజకవర్గం వి. కోట మండలం కరిపల్లి పాఠశాలలో బుధవారం రోజున స్థానిక యండిహెచ్ ఎడ్యుకేషనల్ & చారిటబుల్ ట్రస్ట్ అధినేత యం. డి. పవన్ కళ్యాణ్ గత రెండు సంవత్సరాలుగా కరిపల్లి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు త్రాగునీరు(మినరల్ వాటర్)అందజేస్తున్న కార్యక్రమంలో భాగంగా నవంబర్ నెల వాటర్ బిల్ మొత్తాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేంద్రరావుకి అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా యం. డి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తను చదువుకున్న కరిపల్లి ఉన్నత పాఠశాల రుణం తీర్చుకుంటానని, తన పాఠశాలకు ఎంత చేసినా తక్కువే అని అందులో భాగంగానే గత 2 సంవత్సరాలుగా త్రాగునీరు(మినరల్ వాటర్) అందిస్తూ, పాఠశాల ఆవరణ మరియు భౌతిక అభివృద్ధికి, విద్యార్థుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ విద్యార్థులను విద్య, సామాజిక, నైతిక, క్రీడా, పోటీ రంగాలలో రాణించెందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్