రోడ్డు గుంతలు పూడ్చండి సారూ

63చూసినవారు
రోడ్డు గుంతలు పూడ్చండి సారూ
బీఎన్ కండ్రిగ పట్టణంలోని పదో మైలు నుంచి ఆర్. అనంతపురం, బీఎన్ కండ్రిగ, జంబు గోళం కాలనీలకు వెళ్లే రోడ్డు గుంతలమయమై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని శుక్రవారం స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డు చెరువును తలపిస్తోందన్నారు. రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు గుంతలను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్