తన పొలానికి దారి లేకుండా అడ్డంగా కంచె వేశారని రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గుర్రంకొండ మండలం కృష్ణాపురంకు చెందిన రైతు సుదర్శన్ (40) పొలం వద్దకు దారి లేకుండా మల్లేశ్వరి కంచె వేసింది. అధికారులు పట్టించుకోలేదని పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్ననికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి 108 వాహనంలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.