కలికిరి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం డా. రంగనాథన్ జన్మదినాన్ని పురస్కరించుకుని 57వ జాతీయ లైబ్రరీ వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపల్ వేంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్ పుల్లారెడ్డి విద్యార్థులకు లైబ్రరీ యుటిలిటీ, పుస్తకాల ప్రాముఖ్యత గురించి వివరించారు. కళాశాల లైబ్రరీ హెడ్ జఫ్రూనిసా, వైస్ ప్రిన్సిపల్ త్యాగరాజన్, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారన్నారు.