పీలేరు నియోజకవర్గంలో శాంతిభద్రతలు కాపాడాలని, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు అమ్మినా, కొన్నా ఉపేక్షించబోమని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం పీలేరులో అధికారులతో సమావేశం నిర్వహించారు. పది రోజుల క్రితం గంజాయి మత్తులో ఇద్దరు విద్యార్థులు రైలు కిందపడి మృతి చెందడం వల్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.