దళితుడుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పీలేరు భారతీయ అంబేద్కర్ సేన కార్యాలయంలో వారు మాట్లాడుతూ కలకడ మండలం బండమీద పల్లి ఎస్సీ కాలనీకి చెందిన రెడ్డప్పపై ముగ్గురు అగ్రవర్ణ కులాల వారు దాడి చేశారని కేసు నమోదు చేసి 10రోజులు కావస్తున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. దోషులుపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.