వాల్మీకిపురం మండలం గండ బోయినపల్లిలో కొలువైన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షుడు పులి సత్యనారాయణ రెడ్డి, సర్పంచ్ గుర్రప్ప రమేష్ శేఖర్, అతిథులుగా శివారెడ్డి కుటుంబ సభ్యులు చీర సారెతో ఆలయానికి విచ్చేసారు. వారికి ఆలయ అర్చకులు శాలువాలు కప్పి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.