బంగారుపాళ్యం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్,వైసీపీ సీనియర్ నాయకుడు ఎం.బి.కుమార్ రాజా జన్మదిన వేడుకలను ఆపార్టీ నాయకులు కార్యకర్తలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మొదటగా మొగిలీశ్వర స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ గ్రామాన ఆయన అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు నాయకులు, కార్యకర్తలు కుమార్ రాజాకు శుభాకాంక్షలు తెలియజేశారు.