బంగారుపాళ్యం మండలం మొగిలిశ్వర స్వామి ఆలయంలో బంగారుపాళ్యం కరణం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం 2025వ సంవత్సర వార్షిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కరణం సంక్షేమ సంఘం అధ్యక్షులు భాస్కర పెళ్ళై మాట్లాడుతూ సంఘం ద్వారానే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతారని తెలిపారు. అనంతరం కరణం కుటుంబ సభ్యులకు క్యాలెండర్ పంపిణీ చేశారు.