ద్విచక్ర వాహనం అదుపుతప్పి ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన చౌడేపల్లి మండలంలో జరిగింది. స్థానికులు మరియు పోలీసుల వివరాల మేరకు మండలంలోని మల్లోళ్ల పల్లెకు చెందిన పాలేటి (80) అయన కుమారులు హరి, గంగిరెడ్డి సొంత పనిపై బైకుపై శుక్రవారం సాయంత్రం మదనపల్లెకు బయలుదేరారు. స్కూటర్ మార్గమధ్యలోని చౌడేపల్లి సమీపానికి రాగానే కుక్క అడ్డు రావడంతో బైకు అదుపు తప్పి పడి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.