పుంగనూరు టౌన్ పరిధిలోని కోనేటిపాళ్యం సమీపంలోని అయ్యప్ప స్వామి సన్నిధిలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. అయ్యప్ప మాల ధరించిన స్వాముల సౌకర్యార్థం ఆలయ ధర్మకర్త కృష్ణారెడ్డి ఈ అన్నదాన కార్యక్రమాన్ని మండలం రోజుల పాటు నిర్వహించారు. 20 సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములకు మధ్యాహ్నం ఒక పూట భోజనం ఏర్పాటు చేయటం ఆనవాయితీగా పెట్టుకున్నట్లు కృష్ణారెడ్డి తెలిపారు.