చౌడేపల్లి మండలం ఓబులుపేట గ్రామానికి చెందిన రైతు వెంకటరమణ రెడ్డి సోమవారం వ్యవసాయ పనుల్లో ఉండగా పాము కాటుకు గురయ్యారు. ఈ ఘటనతో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు అతడిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తక్షణమే చికిత్స అందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.