పుంగనూరు రూరల్ చదల్ల గ్రామంలోని సచివాలయంలో సోమవారం సర్పంచ్ గౌరమ్మ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. చదల్ల గ్రామపంచాయతీలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సభలో నిర్ణయం తీసుకుని ప్రజలకు వివరించారు. టీడీపీ మండలం నాయకుడు వెంకట రెడ్డి ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించిందని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలిపారు.