సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందేలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పుంగనూరు అర్బన్ సీఐ శ్రీనివాసులు హెచ్చరించారు. ఆదివారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ గ్రామాల్లో కోడి పందేలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు. గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలన్నారు.