పుంగనూరులో గంగమ్మకు ప్రత్యేక పూజలు

73చూసినవారు
పుంగనూరు పురపాలక పరిధిలోని 22వ వార్డు బెస్త వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాన్నే అమ్మవారి శిలా విగ్రహాన్ని పెరుగు, పాలు, పసుపు, కుంకుమలతో అభిషేకించారు. తర్వాత పట్టుచీర, బంగారు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించి, ఆ ప్రాంతవాసులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్