Dec 02, 2024, 02:12 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
ముస్తాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
Dec 02, 2024, 02:12 IST
ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్ఐ గణేశ్ తెలిపారు. చేపూరి కైలాసం (60) ఆదివారం ఉదయం 8 గంటలకు తన ఎక్సెల్ వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఇటుక ట్రాక్టరు ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన కైలాసం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు సంతోశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.