ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. సర్ధానాలోని కాళింది గ్రామంలో శనివారం ఎనిమిదేళ్ల బాలికను ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఆమె సోదరుడిని లక్ష్యంగా చేసుకుని నిందితులు కాల్పులు జరిపారని, అయితే ఆ కాల్పుల్లో రెండు బుల్లెట్ దెబ్బలు తగిలి అఫియా అనే చిన్నారి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.