రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఏపీఎస్పీడీసీఎల్ సబ్ డివిజన్ రేణిగుంట పరిధిలోని తూకివాకం, కరకంబాడి, గురవరాజు పల్లి, ఎల్లమండ్యం, గాజులమండ్యం, కుర్ర కాలువ సబ్ స్టేషన్ల పరిధిలోని 11 కె.వి లైన్లు, ఎల్ టి లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ లకు ఆటంకం కలిగించే చెట్లను తొలగించడం, మరమ్మత్తుల్లో భాగంగా శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏడీ ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.