రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు సదుంలో మంగళవారం నిర్వహించనున్నట్టు ఎంపీపీ ఎల్లప్ప, జడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు చెప్పారు. నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు.