బీఎన్ కండ్రిగ మండలం కాటూరు సమీపంలోని కాళంగి నది బ్రిడ్జిపై గుంత ప్రమాదకరంగా ఉంది. ఆర్ అండ్ బీ అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని మంగళవారం వాహనదారులు వాపోతున్నారు. వాహనాల టైర్లు పగలడం, పంచర్లు కావడంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఇప్పటికైనా గుంతను పూడ్చాలని కోరుతున్నారు.