సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో బుధవారం ఉదయం వింత వాతావరణం చోటుచేసుకుంది. సూర్యుడు ఉదయిస్తుండగానే తేలికపాటి జల్లులు ప్రారంభమయ్యాయి. సుమారు 20 నిమిషాల పాటు కురిసిన వర్షానికి వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఇప్పటికే మండలంలో ప్రజలు చలి తీవ్రతతో వణికి పోతున్నారు. గత రెండు రోజులుగా మండలంలో వర్షాలు కురుస్తున్నాయి.