తెలుగుగంగ ఇన్ ఛార్జ్ ఈఈగా సుబ్బరత్నారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సత్యవేడు ఇరిగేషన్ సబ్ డివిజన్ డీఈగా పనిచేస్తున్న సుబ్బరత్నారెడ్డికి తెలుగుగంగ ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి గంగ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆయన పిచ్చాటూరు ఇరిగేషన్ డీఈగా పనిచేశారు.