సత్యవేడు: తెలుగు గంగ కాలువలో గుర్తు తెలియని శవం

64చూసినవారు
సత్యవేడు: తెలుగు గంగ కాలువలో గుర్తు తెలియని శవం
సత్యవేడు మండలంలోని మదనంబేడు సమీపంలోని తెలుగు గంగ కాలువలో గురువారం ఓ గుర్తుతెలియని శవం లభ్యమైంది. నీటిలో కొట్టుకు రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి స్థానిక ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతునికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్