ఏపీలోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. పోలీసులు పోసానిని 9 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ ముగియడంతో ఓబులవారిపల్లి పీఎస్ నుంచి రైల్వే కోడూరు జడ్జి నివాసానికి పోసానిని తరలించారు. పోలీసులు పోసానిని పూర్తి ఆధారాలతో కాసేపట్లో జడ్జి ముందు హాజరుపరచనున్నారు. ఓబులవారిపల్లె పీఎస్‌లో పోసానిపై BNS 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కేసు నమోదైన సంగతి తెలిసిందే.