AP: దుబాయ్‌లో జరిగిన ఇండియా – పాక్ మ్యాచ్‌ను మంత్రి నారా లోకేశ్ చూసిన విషయం తెలిసిందే. జైషాతో భేటీపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. అహ్మదాబాద్ తర్వాత అతిపెద్ద స్టేడియాన్ని అమరావతిలో నిర్మించాలని జైషాను కోరారు. అయితే అందుకు ఆయన వెంటనే అంగీకరించినట్లు లోకేశ్ తాజాగా తెలిపారు. అహ్మదాబాద్ స్టేడియం నిర్మాణం, ఇతర అవసరాలకు దానిని ఎలా వాడుతున్నారు అనే అంశాలను జైషాకు వివరించినట్లు పేర్కొన్నారు.