శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసియున్న మృత్యుంజయ స్వామివారికి సోమవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మృత్యుంజయ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పన్నీరు వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. తదుపరి స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.