నాయుడుపేట మండలం తిమ్మాజీకండ్రిగ గ్రామ సమీపంలో స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు చేసుకొని నిర్మాణాలు జరుగుతున్న తీరుపై గురువారం ఇరిగేషన్ శ్రీనివాసులు పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి, వీఆర్ కలిసి పరిశీలించి నదిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు. నదిలో నిర్మాణాలు చేపడితే వాటిని పడకొడతామని వారికి హెచ్చరికలు చేశారు. ప్రస్తుతం ఉన్న ఆక్రమణలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.