తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా గెలిచిన నెలవల విజయశ్రీ సోమవారం తొలిసారి అసెంబ్లీలో మాట్లాడారు. నియోజవర్గంలోని కొరిడి-పేరినాడుకు ఏళ్ల తరబడి నుంచి రోడ్డు లేదన్నారు. 2004-09 సమయంలో తమ తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి రోడ్డు ఏర్పాటుకు ప్రయత్నించారని తెలిపారు. అటవీ, రోడ్డు భవనాలపై మంత్రులు దృష్టి సారిస్తే 5వేల మంది ప్రజల సమస్యలు తీరుతాయని తెలియజేశారు.