తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలో శుక్రవారం ఒక్కసారిగా చిరుజల్లులతో కూడిన తేలిక వర్షం కురిసింది. ఒక్కసారిగా చిరుజల్లులు కురవడంతో చిరు వ్యాపారులు, వాహనదారులు కాస్త ఇబ్బందికి గురయ్యారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మంచు ప్రభావంతో చలికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ వర్షం కురవడంతో చలి తీవ్రత పెరుగుతుందని పట్టణ వాసులు భయపడుతున్నారు.