తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం అన్నమేడు గ్రామంలోని సాగర మాల జాతీయ రహదారి రోడ్డు పనులకు సంబంధించి సేకరించిన భూములను తహశీల్దార్ గీత వాణి గురువారం పరిశీలించారు. అన్నమేడు గ్రామం వద్ద ఇటీవల ఆర్డిఓ సాగరమాల రహదారి కోసం జరుగుతున్న పనులను పరిశీలించి వెళ్లారు. ఆమె ఆదేశాల మేరకు తహశీల్దార్ కూడా అన్నమేడు వద్ద జాతీయ రహదారి కోసం కేటాయించిన భూములు పరిశీలించి అక్కడ పనులు జాప్యం లేకుండా చేసేలా చర్యలు చేపట్టారు.