తంబళ్లపల్లె మండల వ్యాప్తంగా గురువారం 12 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 156 మందికి బీసీజీ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కోసువారిపల్లె ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి ముని కుమార్ తెలిపారు. క్షయ(టీబీ) నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ టీకాను పంపిణీ చేస్తోందన్నారు. షుగర్ వ్యాధిగ్రస్థులు, మద్యం అలవాటు, టీబీ చికిత్స పొందినవారు, వారి కుటుంబ సభ్యులు, బీఎంఐ 18లోపు వారు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు.