Oct 03, 2024, 10:10 IST/
గుండెపోటుతో బండిమీదే కుప్పకూలి చనిపోయాడు (షాకింగ్ వీడియో)
Oct 03, 2024, 10:10 IST
ఒడిశాలోని అక్టోబర్ 1 న హృదయవిదారక ఘటన జరిగింది. ఓ చిరు వ్యాపారి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. తన బతుకుబండిని లాగే ద్విచక్రవాహనంపై కుప్పకూలి మృతి చెందాడు. అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మరణం ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.