ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా బుమ్రా

62చూసినవారు
ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా బుమ్రా
భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్‌‌ బుమ్రా 2024 సంవత్సరానికిగాను టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు తాజాగా ఇంటర్‌నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) వెల్లడించింది. గతేడాది టెస్టుల్లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే 2024లో సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

సంబంధిత పోస్ట్