ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం.. గ్రోత్ సెంటర్ల ఆధారంగా 0-20శాతం ఛార్జీలు పెంచనున్నారు. ప్రస్తుతం భూమి కొనుగోలు చేస్తే రూ.లక్ష రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే.. కొత్త రేట్ల ప్రకారం రూ. 1.20 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాలకు ఈ ఛార్జీల పెంపును మినహాయింపునిచ్చారు.