వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని విదేశీయ భక్తులు కొందరు తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్ర ధారణతో తిరు నామం ధరించి శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని విదేశీయ భక్తులు చెప్పారు.