తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి బుధవారం రాత్రి స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. గవర్నర్ రాత్రి తిరుమలలోని బస చేసి గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకోనున్నారు.