తిరుమలలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం

54చూసినవారు
తిరుమలలో శుక్రవారం అక్రమంగా కారులో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అధికారులు పట్టుకున్నారు. పాప వినాశనం అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిందని వారు తెలిపారు. దీంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పార్వేట మండపం వద్ద మాటు వేసి కారును ఆపి తనిఖీలు చేపట్టారు. వాహనం నుంచి స్మగ్లర్లు అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. వాహనంతో పాటు దుంగలను స్థానిక తిరుమల అటవీ కార్యాలయానికి తరలించారు.

సంబంధిత పోస్ట్