తిరుపతి నగరం కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గురువారం జెర్రిపోతు పాము హల్ చల్ చేసింది. దీంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. అధ్యాపకులు వెంటనే టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడికి సమాచారం అందించారు. కళాశాల వద్దకు చేరుకున్న భాస్కర్ నాయుడు జెర్రిపోతును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం శేషాచల అడవిలో వదిలిపెట్టారు.