వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని శుక్రవారం తెలంగాణ మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దామోదర రాజనర్సింహ, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, గడ్డం వినోద్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి, మాజీ మంత్రి మల్లా రెడ్డి, కడియం శ్రీహరి తదితరులు ఉన్నారు.