సోషల్ మీడియాలో తన కూతురుని వేధిస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా యలమందకు చెందిన బాలిక ఘటనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న జనసేన నేతల వ్యాఖ్యలపై రోజా మండిపడ్డారు. మంగళవారం తిరుపతిలో ఆమె మాట్లాడుతూ తన మీద సోషల్ మీడియాలో ఎన్నో రాశారని అన్నారు. తమ కూతురును ఏ విధంగా వేధిస్తున్నారో ఒక్కసారి సోషల్ మీడియాలో చూడాలని. తమకు కుటుంబాలు లేవా అని ప్రశ్నించారు.