టీటీడీలో వైసీపీ తిమింగళాలు ఇంకా ఉన్నాయని జనసేన నేత కిరణ్ రాయల్ తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఆరోపించారు. గతంలో భక్తులు ఇచ్చిన కానుకలు అన్నీ జగన్, ఆయన అనుచరులకు చేరాయని చెప్పారు. వారిని తాను ప్రశ్నించినందుకే తప్పుడు కేసులు పెట్టారన్నారు. తాము కోరినట్లు భక్తులకు టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ పాలక మండలి నిర్ణయించడాన్ని స్వాగతించారు. స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించడం ఆనందదాయకమన్నారు.