గురుకుల పాఠశాలను సందర్శించిన ఎస్టీ కమిషన్ సభ్యులు
రేణిగుంటలోని గురుకుల పాఠశాలను ఆదివారం సాయంత్రం ఏపీ స్టేట్ ఎస్టి కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని తరగతుల గదులను విద్యార్థుల నైపుణ్యాన్ని అడిగి తెలుసుకుంటూ మమేకమయ్యారు. భోజనశాల, పడకగదులను, త్రాగునీరు, మరుగుదొడ్లను పరిశీలించి లోటుబాటుల గురించి ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని సూచించారు.