సెలవు కావడంతో ఈ నెల 31వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శనివారం తెలిపారు. 18వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముందస్తుగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతతో సీఎం చంద్రబాబు పెన్షన్లను అందజేస్తున్నారన్నారు.