తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఆదివారం మహా పూర్ణాహుతితో తొమ్మిది రోజుల పాటు జరిగిన గణేశ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సెప్టెంబర్ 7న వినాయక చవితి రోజున ఈ నవాహ్నిక కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి రోజు శ్రీవినాయకుడిని వేర్వేరు అలంకారాలతో వేర్వేరు వాహనాలపై పూజించారు. వాహనసేవకు ముందు అంకురార్పణం, పుణ్యాహవాచనం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వంటి అనేక క్రతువులు ప్రతిరోజూ నిర్వహించారు.