వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ (వీడియో)

67చూసినవారు
AP: పుష్ప-2 బ్యానర్ విషయంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. పాకాలలో ఉన్న ఓ థియేటర్ వద్ద కొందరు వైసీపీ శ్రేణులు పుష్ప-2 బ్యానర్ ఏర్పాటు చేశారు. బ్యానర్‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని టీడీపీ కార్యకర్తలు వాటిని తొలగించారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. టీడీపీ నేతల ఫిర్యాదుతో ఏడుగురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్