ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించేలా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాల వినతి మేరకు గ్రాట్యుటీపై రూ.16 లక్షల సీలింగ్‌ను ఎత్తివేసింది. ఇప్పటివరకు తక్కువ మొత్తం పొందిన రిటైర్డ్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. బకాయిల కోసం ఉద్యోగులు వెంటనే డిపోల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.