త్వరలో రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ: నాదెండ్ల

54చూసినవారు
త్వరలో రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ: నాదెండ్ల
AP: రేషన్ పంపిణీపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. త్వరలోనే రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. శుక్రవారం పాడేరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికీ సరఫరా అవుతున్న బియ్యం పక్కదారి పడుతోందన్నారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్