ఏపీలోని పలు జిల్లాల్లో శనివారం వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, అల్లూరి, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.