ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ఆద్యుడు, రూపకర్త అని పవన్ అన్నారు. 'ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుంది. వర్గీకరణ బిల్లుకు మనస్పూర్తిగా ఆమోదం పలుకుతున్నాం. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే చంద్రబాబు, మందకృష్ణ కారణం. మాదిగల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత మందకృష్ణదే’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.