ధోనీ నిబద్ధతపై రైనా ఆసక్తికర వ్యాఖ్యలు

54చూసినవారు
ధోనీ నిబద్ధతపై రైనా ఆసక్తికర వ్యాఖ్యలు
చెన్నై కీలక ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీకి ఆటపై ఉన్న నిబద్ధతపై ఆ జట్టు మాజీ ప్లేయర్ సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను భారత జట్టుతో పాటు CSKకు ధోనీతో కలిసి ఆడా. ఐపీఎల్‌ కోసం కనీసం నెల ముందే ధోనీ చెన్నైకి చేరుకుంటారు. ఏవైనా షూటింగ్‌లు ఉంటే వాటిని రద్దు చేసేస్తారు. కనీసం 3 గంటల పాటు బ్యాటింగ్‌ ప్రాక్టీస్ చేసేవారు. రఫ్‌ పిచ్‌లను సిద్ధం చేయించుకుని.. స్పిన్నర్లను ఎదుర్కొనేవాళ్లం" అని రైనా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్